Pm narendra modi introducing jandhan yojana scheme for people

pm narendra modi, narendra modi, narendra modi latest news, narendra modi new scheme, jandhan yojana scheme, bank accounts, modi bank account, jandhan yojana bank accounts, narendra modi new twist, narendra modi jandhan yojana scheme

pm narendra modi introducing jandhan yojana for people : Indian prime minister narendra modi introducing a new scheme jandhan yojana for poor people. By this scheme people will get bank accounts from which they will get government funds directly.

మోడీ కొత్త ట్విస్ట్.. బ్యాంకు ఖాతా వుంటేనే పథకాలు!

Posted: 08/26/2014 06:30 AM IST
Pm narendra modi introducing jandhan yojana scheme for people

(Image source from: pm narendra modi introducing jandhan yojana scheme for people)

అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోడీ దేశ అభివృద్ధి పేరుమీద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రైలు ఛార్జీలను బారీగా పెంచేసి, ప్రయాణికులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే! అలాగే వంటగ్యాస్, పెట్రోలు, డీజెల్ వంటి తదితర ధరలను కూడా పెంచేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయైన దేశప్రజలు ‘‘ఎందుకిలా చేశారు’’ అంటూ ప్రశ్నించగా.. దానికి బదులు మోడీ.. ‘‘దేశ అభివృద్ధి కోసం కొన్నింటిని త్యాగం చేసుకోక తప్పదు. అందులో భాగంగానే ఛార్జీలను పెంచాల్సి వచ్చింది’’ అంటూ సర్దుబాటు చేసుకున్నారు. ఇక తాజాగా మోడీ మరో కొత్త వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో వున్న ప్రతి పేదకుటుంబానికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా వుండాల్సిందేనని పేర్కొన్న మోడీ.. అప్పుడే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 7 కోట్ల పేద కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇవ్వాలనే లక్ష్యంతో ‘‘జన్ ధన్ యోజన’’ చేశారని.. దానిని పూర్తి చేసే దిశగా త్వరగా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ప్రజలకోసం ప్రత్యేకంగా ఇచ్చే సంక్షేమ ఫలాలు నేరుగా వారికే చేరుతాయన్నది ఆయన అభిప్రాయం!

అయితే మోడీ వ్యాఖ్యానాలను బాగా గమనిస్తే.. కేవలం బ్యాంకు ఖాతాలు వున్నవారికే సంక్షేమ పథకాలు అమలు జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బ్యాంకు ఖాతాలేని వారి పరిస్థితి ఏంటో మరి! నిజానికి పల్లెటూళ్లలో వుండే రైతులకు, పేద ప్రజలకు చదవడంగానీ, రాయడంగానీ ఏమీ తెలియదు. మరి అటువంటివారికి ఈ బ్యాంకు ఖాతాల గురించి ఏమి తెలుస్తోంది..? వారికి ప్రత్యేకంగా కొంతమంది అధికారులను ఏర్పాటు చేయించి, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తారా..? అంటూ ప్రశ్నలు సంధించినా కోణంలో ఆయన పార్టీ వర్గీయులు అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో వేచి చూడాలి..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more