Expose tainted candidates in haryana

Haryana Assembly Polls, Aam Aadmi Party, Bharatiya Janata Party, Indian National Congress, Yogendra yadav

Aam Aadmi Party will not contest the Haryana assembly elections, but expose tainted candidates

అవినీతిపరుల సమాచారం అందించండి..

Posted: 09/13/2014 12:53 PM IST
Expose tainted candidates in haryana

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థుల వివరాలను తమకు తెలియజేయాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. అక్టోబర్ 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తమ పార్టీ నిలవబోదని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల బరిలో నిలవనున్న అవినీతి పరుల జాతకాలను తాము బట్టబయలు చేస్తామని వెల్లడించారు. అవినీతి పరులకు ఓటు వేయవద్దని ప్రజలకు ఈ సందర్భంగా విన్నవించిన ఆయన.. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేస్తామని చెప్పారు.

ఈ మేరకు హర్యానా ప్రజలకు ఆయన ఓ ప్రత్యేక టెలిఫోన్ నెంబరు ఇచ్చారు. అవినీతి అభ్యర్థుల వివరాలను సదరు ఫోన్ నెంబరుకు ఇవ్వాలని, ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా వుంచుతామని చెప్పారు. ప్రజలతో కలసి, ప్రజాహితం కోసం చేస్తున్న మంచిపనికి ప్రజల సహకారం వుంటుందని యోగేంద్రయాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా హర్యానా ఎన్నికలలో జాతీయ పార్టీలు ఖరారు చేసే అవినీతి అభ్యర్థులను జాబితాను పోలింగ్ తేదీకి ముందు ప్రజల్లోకి విడుదల చేస్తామన్నారు. హర్యానాలో తాము బలంగా లేమని, అందుచేతనే తాము ఎన్నికల బరిలో నిలవడం లేదని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana Assembly Polls  Aam Aadmi Party  AAP  BJP  Congress  Yogendra yadav  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more