ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్మృతి చిహ్నంగా వున్న విగ్రహాన్ని రష్యాలో ధ్వంసం చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను స్వలింగ సంపర్కుడినేనంటూ.. ఆపిల్ కంపెనీ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల మేర వున్న స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని ఆయన మరణానంతరం స్మృతి చిహ్నంగా రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాను స్వలింగ సంపర్కుడినేనంటూ టిమ్ కుక్ వెల్లడించిన నేపధ్యంలో ఆతడిపై.. వున్న కోపాన్ని సదరు జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ ఇలా వ్యక్తం చేసింది. రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కారణంగా తాము స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more