Minister ram shankar katheria in row over charge of marks forgery

Forgery, Ram Shankar kateriya, degree marks memo, BSP government, Allahabad court, Agra sessions court

minister ram shankar katheria in row over charge of marks forgery

వివాదంలో మోడీ క్యాబినెట్ మంత్రి కతేరియా

Posted: 11/14/2014 12:39 PM IST
Minister ram shankar katheria in row over charge of marks forgery

ప్రధాని మంత్రి నూతనంగా ఈ నెల 9న విస్తరించిన క్యాబినెట్ లో 13 మంది కళంకిత మంత్రుల సంఖ్య పెరుగుతూనే వుంది. జాతీయ బ్యాంకులకు 316 కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిన సుజనా చౌదరి మొదలు పెట్టుకుంటే మొత్తం 13 మంది కేంద్ర మంత్రలు మోడీ సర్కారుకు అపఖ్యాతి తీసుకువచ్చేలా కనబడుతున్నారు. 13 మంది కేంద్ర మంత్రులు కళంకితులని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు వీరి జాబితాలోనే మరో మంత్రి వచ్చి చేరారు. కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ శంకర్ కతేరియా ఫోర్జరీ వివాదంలో చిక్కుకున్నారు.

ఆయన డిగ్రీ మార్కుల జాబితా ఫోర్జరీకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మంత్రి కతేరియా కొట్టిపారేశారు. ఫోర్జరీ మార్కుల జాబితాకు సంబంధించి 2010లో కతేరియాపై పోటీ చేసిన బీఎస్‌పీ అభ్యర్థి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు ఆగ్రా సెషన్స్ కోర్టుకు రిఫర్ చేసింది. ఈ నెల 26న ఈ కేసు విచారణకు రానుంది. అయితే ఫోర్జరీ ఆరోపణలను కొట్టిపారేసిన కతేరియా.. తనపై బీఎస్‌పీ ప్రభుత్వం రోజుకు నాలుగు కేసులు పెట్టేదన్నారు. బీఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసుల నుంచి తాను బయటపడ్డానని, దీని నుంచి కూడా బయటపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more