విభజన తర్వాత పరిష్కారం అవుతాయనుకున్న సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మద్య ప్రతి విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి. అటు విభజన చట్టంలో ప్రస్తావించిన చాలా అంశాలు పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేదు. ప్రధానంగా విద్యుత్ పంపిణీ, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ రంగ సంస్థల నిధుల పంపిణీ వంటి విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే విభజన చట్టానికి మరోసారి సవరణ చేయాలని కేంద్రం యోచిస్తోంది. గతంలో పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి ఏపీలోకి కలుపుతూ తొలి సవరణ చేశారు.
ఇప్పుడు విద్యుత్ పంపిణీతో పాటు, ఇతర ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా రెండవ సవరణ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు హస్తిన పర్యటనలో ఉన్న గవర్నర్ నుంచి సవరణపై సమాచారం సేకరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడి ఇవాళ స్వయంగా నరసింహన్ తో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నారు. సవరణ వల్ల కలిగే ఉపశమనంతో పాటు, రెండు రాష్ర్టాల మద్య సమస్యల శాశ్వత పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అటు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సహా వివిధ శాఖల కీలక ఉన్నతాధికారులతో సమావేశమైన నరసింహన్ తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితులను వివరించారు. ఇవాళ జరిగే సమావేశంలో తెలంగాణ, ఏపీ తగాదాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more