ఎప్పుడైనా విమానయానం చేశారా..? ఎప్పుడైనా విదేశాలకు వెళ్లారా..? ఎప్పుడు వినడమే తప్ప వెళ్లడమా అంటూ నిట్టూర్చుతున్నారా..? విదేశాలకు టూర్ వీసాపై వెళ్లి వచ్చేందుకు వేలు ఖర్చు అవుతాయ్.. అంటారా..? విమాన టిక్కెటు ధరను చూసి జంకుతున్నారా.? ఇక మీరు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రయాణికులకు చవకధర విమానయాన్ని అందిస్తున్న ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ మీకు మంచి ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఎక్కడికి వెళ్లామన్నాది ముఖ్యం కాదు.. వెళ్లామా లేదా అన్నదే ముఖ్యమని భావించే వారికి మాత్రం ఇది మంచి ఆపర్.
ఇప్పటికే దేశీయంగా పలు మార్గాల్లో చవకధరకు విమానయానాన్ని అందించిన ఎయిర్ ఏసియా.. మరో బంఫర్ ఆఫర్ ను ప్రయాణికులకు అందించింది. మరోలా చెప్పాలంటే.. రైలు చార్జీల కన్నా తక్కువ ధరలో టిక్కెట్ ను అందించిన విమానయాన సంస్థ కేవలం మూడు వేల రూపాయలకే విదేశీ ప్రయాణాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మలేసియాకు వెళ్లి వీక్షించే ప్రయాణికుల కోసం ఈ ఆపర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 28 లోగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 15 నుంచి ఆగస్టు 31 లోగా చేసే పరయాణాలకు ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ ఆపర్ లో భాగంగా 30 లక్షల మందికి వర్తించే విధంగా ఆ మేరకు టిక్కెట్లను రిజర్వు చేసి అమ్మకానికి వుంచింది. కొచ్చి నుంచి కౌలాలంపూర్ రూ. 2999లకే టికెట్ లభిస్తుంది. అలాగే కోచ్చి నుంచి హాంకాంగ్, పెనాంగ్, సింగపూర్ ప్రాంతాలకు 4019, కోచ్చి నుంచి మెల్ బోర్న్, ఫెర్త్ సిడ్నీ లాంటి అస్ట్రేలియా నగరాలకు మాత్రం టికెట్ ధరను రూ.5.739 నిర్ణయించారు. వివిధ భారతీయ నగరాల నుంచి అంతార్జతీయ నగరాలకు కూడా ప్రత్యేక ఆపర్లు ప్రకటిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more