మారుతి సుజుకీ నుంచి మరో కొత్త ప్రీమియం కారు ఆగస్టు తొలివారంలో భారతీయ విఫణిలోకి అడుగుపెట్టనుంది. అదే మారుతి సుజుకీ ఎస్-క్రాస్. ఇప్పటి వరకు సామాన్య మద్య తరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకుని వారికి అనువైన ధరల్లో కార్లను అందించిన మారుతి సుజుకీ.. ఇకపై ప్రిమియం కార్లను అందించందేకు కూడా శ్రీకారం చుడుతుందని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( మార్కెటింగ్ అండ్ సేల్స్) అర్.ఎస్, కల్సి చెప్పారు. ఇలాంటి ప్రీమియం కార్లను నెక్సా బ్రాండ్ అవుట్ లెట్ల ద్వరా విక్రయిస్తామని వివరిచారు. ఎస్-క్రాస్ ధర రూ. 8 లక్షల నుంచి 12 లక్షల మధ్య వుండవచ్చని అంచనా. అయితే బేసిక్ మోడళ్లోనూ ఎయిర్ బ్యాగ్స్ వుండటం కూడా గమనించాల్సిన అంశమే.
ఇక మరోవైపు ఆషాఢం మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది మారుతి సుజుకీ, మారుతీ సుజుకీ ఉత్సాదనల్లో ఏదేని (ఎంపిక చేసిన మొడళ్ల) కారును ఈ నెల 31 లోపు కొనుగోలు చేసేవారికి ఒక బహుమతి ఖచ్చితంగా లభిస్తుందని తెలిపింది. కారును కోన్న వారికి ముందుగా ఒక స్ర్కాచ్ కార్డును ఇస్తామని కంపెనీ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ మునీష్ బాలి పేర్కోన్నారు. కొనుగోలుదారులకు 34 వేల విలువైన ఖచ్చితమైన మూడు బహుమతులతో పాటు బంపర్ డ్రాలో కొత్త స్విస్ట్ డీజిల్ కారును గెల్చుకునే అవకాశముందని కూడా వివరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more