Stock markets close in green on firm global cues

Sensex provisionally closes over 275 points up

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Traders at the dalal street experienced a good day as the stock market closed in green.

స్టాక్ మార్కెట్లుకు లాభాలు.. మూడు నెలల గరిష్టస్థాయికి సెన్సెక్స్

Posted: 07/16/2015 04:35 PM IST
Sensex provisionally closes over 275 points up

ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి.  వరుసగా రెండో రోజు లాభాలతో దేశీయ సూచీలు క్రమంగా మూడు మాసాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్రీస్ సంక్షోభంపై అక్కడి పార్లమెంటు కఠినంగా పొదుపు చర్యలు తీసుకోవడం సహా పలు అంశాలు మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 28 వేల స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 8500 మార్కును దాటింది.

వచ్చే ద్రవ్యవిధాన సమీక్షలో రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను సవరిస్తుందన్న అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్‌ అణు ఒప్పందం చమురు మార్కెట్లతో పాటు స్టాక్‌ మార్కెట్లకు కూడా మద్దతునిచ్చింది. చైనా మినహా అన్ని స్టాక్స్‌ కూడా  లాభాల్లోనే నడిచాయి. అలాగే ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు ప్రతిపాదనలు కూడా కొంత ప్రభావితం చేశాయి.యూరో జోన్‌లోని ఆర్థిక సంక్షోభం ముగియడం, అమెరికా ఆర్థిక గణాంకాలు, ఉపాధి గణాంకాలతో పాటు ఫెడ్‌ ఛైర్మన్‌ సెనెట్‌లో అందచేసే నివేదికలు కూడా రిజర్వుబ్యాంకు వచ్చేనెల ద్రవ్యవిధాన సమీక్షలో కీలకం అవుతాయని అంచనాలు వేస్తున్నారు.

ఇవాళ ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లను లాభాలు పలకరించాయి. ఆ తరువాత క్రమంగా లాభాల బాటలో నడుస్తూ చివరకు 248 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28 వేల 446 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 84 పాయింట్ల లాభంతో  8వేల 608 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని సూచీలు లాభాల బాటలోనే ర్యాలీని కోనసాగించగా, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు, అయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ తదితర సూచాలు లాభాల బాటలో ముందున్నాయి. ఈ క్రమంలో వేదాంత, ఎన్ఎండీసీ, మహింద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, బ్యాంక్ అఫ్ బరోడా సంస్థల షేర్లు నష్టాలను చవిచూడగా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహింద్రా, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బిహెచ్ఇఎల్, తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles