చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్ ప్లస్ తక్కువ ధరలో హైఎండ్ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 3 ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా నూతనంగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 3టీ మిడ్ నైట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ ను నుంచి భారత విఫణీలోకి అందుబాటులోకి వచ్చింది. కేవలం 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ లోనే అందుబాటులో ఉండే దీని ధర రూ.34,999 లని సంస్థ వర్గాలు తెలిపాయి.
భారతీయ స్మార్ ఫోన్ అభిమానులు ఈ వన్ ప్లస్3టీ ఫోన్లను వన్ ప్లస్ ఇండియా స్టోర్లతో పాటుగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్ ఫీరియన్స్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో వుంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇవాళ బెంగళూరులో మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయించడం ప్రారంభించిందని తెలిపింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3టీ బ్లాక్ కొలెట్టే ఎడిషన్ మాదిరే ఉండనుంది. అయితే ఎన్ని డివైజ్లను విక్రయానికి సిద్దం చేసిందన్న వివరాలతో పాటు ఎంత మేరకు లక్ష్యాన్ని నిర్ధేశించుకుందన్న విషయాలను కంపెనీ ప్రకటించలేదు.
యూనిక్ కలర్లకు మారుపేరుగా నిలుస్తున్న వన్ ప్లస్.. ఈ ఫోన్ను ప్రస్తుతం ఓ ప్రత్యేక రంగులో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 128జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ ఫోన్ కు ఒకేలా ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821, 6జీబీ ర్యామ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ ఛార్జ్ దీని ప్రత్యేకతలు. అంతేకాక వన్ ప్లస్ 3కి స్వల్ప మార్పులతో ఈ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వన్ ప్లస్ 3 కంటే వేగవంతమైన ఎస్ఓసీ, స్టోరేజ్ పెంపు, ఫ్రంట్ కెమెరాకు మెరుగులు, పెద్ద బ్యాటరీ వంటివి దీనిలో మార్పులు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more