ప్రపంచ మార్కెట్ల గమనం ప్రతికూలం దిశగా కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం చారిత్రాత్మక గరిష్టాలను తాకుతూ.. మునుపెన్నడూ తాకని ఉన్నత శిఖరాలను అందుకుని రికార్డులను నమోదు చేసుకుంటున్నాయి. అల్ టైం హై రికార్డులను నమోదు చేసుకుంటూ మదుపరులలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 30,007 వద్ద ఆల్ టైం హై స్థాయిని తాకగా నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. నిఫ్టీ ఇంట్రాడేలో 9,268ని చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది.
ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు పాజిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయి. గ్రీడ్ అండ్ ఫియర్ మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో మిడ్‌సెషన్ అనంతరం కొనుగోళ్ళ ధోరణి నెలకొంది. మరోవైపు ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ లాభాలు మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది. మిడ్ క్యాప్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ గరిష్ట స్థాయిలో 64 పాయింట్ల లాభంలో 29,974 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల లాభంలో 9250కి పైనే ముగిసింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పురోగమించాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐటీసీ , ఇన్ఫోసిస్ నష్టాల్లో నడువగా, మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్ 4 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కో, జీ, ఆర్‌ఐఎల్, గ్రాసిమ్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, బీవోబీ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. దీంతో ఎనలిస్టులు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. అయితే ఈ స్తాయిల్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కాగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరుగనున్న నేపథ్యంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చునన్న సంకేతాలు కూడా మార్కెట్లను అశాజకంగా వుంచాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more