ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండడంతో కంపెనీల నుంచి ఈ తరహా ఆవిష్కరణలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఆటో ఎక్స్ పో 2018లో ట్వెంటీ టు మోటార్స్ అనే స్టార్టప్ సంస్థ ఫ్లో పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ రోజు ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. మూడేళ్లలో 2 లక్షల వాహనాలను అమ్మాలనుకుంటోంది. హర్యానాలోని తయారీ యూనిట్ లో వాహనాలను తయారు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
రోజుకు 300 వాహనాల తయారీతో కార్యకలాపాలు ఆరంభించనున్నామని కంపెనీ సీఈవో ప్రవీణ్ ఖర్బ్ ప్రకటించారు. ఈ స్కూటర్ లో జియో ఫెన్సింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. నిర్ణీత సరిహద్దులు దాటి స్కూటర్ బయటకు వెళ్లిందంటే అలర్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా స్కూటర్ ను తస్కరించి తీసుకెళెతుంటే అప్రమత్తం చేస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీని గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. వాహనాలకు ముందస్తు బుకింగ్ లు నేటి నుంచి ప్రారంభం కాగా, ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ వెబ్ సైట్ చిరునామా
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more