భర్త : ఈరోజు భోజనానికి ఏం చేస్తావ్?
భార్య : మీకు చెప్పిందే చేస్తాను.
భర్త : అలా అయితే అన్నం-పప్పు చేసేయ్.
భార్య : అరె.. నిన్ననే కదా తిన్నారు.
భర్త : అయితే పరోటాలు చేయ్
భార్య : రాత్రిపూట పరోటాలు ఎవరు తింటారు.
భర్త : అయితే ఇడ్లీ సాంబార్ చేయ్...
భార్య : లేదు.. అది చేయడానికి చాలా సమయం పడుతుంది.
భర్త : అయితే మ్యాగీ చేయ్..
భార్య : దాంతో కడుపు నిండదు.
భర్త : అలా అయితే ఏం చేస్తావ్..?
భార్య : మీరు చెప్పిందే చేస్తాను...!
అమ్మ : చింటూ.. ఆంటీకి ఒక కిస్ ఇవ్వు.
చింటూ : నేను ఇవ్వను
అమ్మ : ఎందుకురా..?
చింటూ : ఉదయాన్నే డాడీ పెడితే.. చెప్పుతో కొట్టింది.. అందుకే!
భర్త : ‘‘ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటావా?’’ అని అడిగాడు భర్త.
భార్య : ‘‘మీరే చేయించుకోండి.. నాకింకా చేయించుకోవాలని లేదు. పిల్లల మీద ఆశ చావలేదు’’ అని అంది.
పరీక్ష సమయంలో పరీక్ష రాయకుండా ఖాళీగా కూర్చున్న స్టూడెంట్ ని చూసి టీచర్ అతన్ని ఈ విధంగా అడుగుతుంది.
టీచర్ : ‘‘నువ్వు ఇంత దిగులుగా ఎందుకు కూర్చున్నావు?’’
స్టూడెంట్ సమాధానం ఇవ్వలేదు.
టీచర్ : ‘‘అసలేమైంది..? పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయావా?’’
స్టూడెంట్ అస్సలు మాట్లాడటం లేదు.
టీచర్ : ‘‘నీ రోల్ నెంబర్ మర్చిపోయావా?’’
స్టూడెంట్ ఈసారి కూడా నోరు మెదపలేదు.
టీచర్ (కోపంగా) : ‘‘అరె, అసలేమైంది? ఇంతగా అడుగుతున్నాను. ఏం చెప్పవేంటి?’’
స్టూడెంట్ (చాలా కోపంగా) : ‘‘ఓయ్! నోరు మూసుకోవే తల్లీ, నేను స్లిప్ తప్పు తెచ్చుకున్నాను. నువ్వు చూస్తే అప్పటినుండి పెన్ను, పెన్సిల్ మీద పడ్డావ్’’ అని కసురుకున్నాడు.
బడిలో పాఠాలు చెప్పడానికి అని మాష్టారు గదిలోకి ప్రవేశించగానే.. ఆయన్ని చూసిన ఒక విద్యార్థి ‘‘సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది’’ అని అంటాడు.
అప్పుడు మాష్టారు కోపంగా.. ‘‘అందుకే స్కూలుకి 29 రోజులు లీవ్ పెట్టకుండా రోజు రమ్మనేది ఇందుకే. నేనేరా మీ క్లాస్ మాష్టారు’’ని అని అంటాడు.
టీచర్ : మీ నాన్న పేరేంటి ? తెలుగులో మాట్లదవద్దు , ఇంగ్లీష్ లో చెప్పు బంటి ?
బంటి : రైస్ పిస్ కింగ్ టీచర్
టీచర్ : అదేం పేరూ ?
బంటి : తెలుగులో నూక రాజు టీచర్ , మీరూ ఇంగ్లిష్ లో చెప్పమన్నారుగా.
టీచర్ : అదేం పేరూ ?
బంటి : తెలుగులో నూక రాజు టీచర్ , మీరూ ఇంగ్లిష్ లో చెప్పమన్నారుగా.
"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది.
నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.
"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.
"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.