"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది.
నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.
"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.
"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.