ఒకరోజు ఒక మహిళ చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళుతుంది. ఆమె కళ్లు నల్లగా, నీలం రంగులో మారిపోయి వుంటాయి. అప్పుడు ఆమెను చూసి...
డాక్టర్ : ఏమైంది? ఏంటి మీరు అలా వున్నారు?
మహిళ : డాక్టర్ గారు... నాకేం చేయాలో అస్సలు అర్థమవ్వడం లేదు? నా భర్త రోజు తాగి వస్తాడు. వచ్చి రాగానే నన్ను కొట్టడం మొదలు పెడతాడు.
డాక్టర్ : దీనికి సంబంధించి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన చికిత్స వుంది. నీ భర్త ఎప్పుడైతే తాగి ఇంట్లోకి వస్తాడో.. అప్పుడు నువ్వు గోరువెచ్చని నీరులో కొంత ఉప్పు కలుపుకుని పుక్కిలించడం మొదలుపెట్టు. అలాగే చేస్తూనే వుండు. నిలబెట్టకుండా చాలాసేపు వరకు పుక్కిలిస్తూనే వుండు.
ఇలా డాక్టర్ చెప్పినట్లుగానే మహిళ రెండువారాల వరకు గోరువెచ్చని నీరులో ఉప్పు కలుపుకుని పుక్కిలిస్తూ వుంది. రెండు వారాల తరువాత డాక్టర్ దగ్గరకు వెళుతుంది. అప్పుడు ఆమె ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నట్లు డాక్టర్ కు కనిపిస్తుంది.
మహిళ : డాక్టర్ గారూ.. మీరు నిజంగానే ఒక బ్రహ్మాండమైన ఐడియాను చెప్పారు. ఇప్పుడైతే నా భర్త తాగి ఇంటికి రాగానే నేను పుక్కిలించడం చూసి ఆయన నన్ను ముట్టుకోవడం కూడా లేదు.
డాక్టర్ : చూశావా.. నోరును అదుపులో వుంచుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో!