భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజూ ఏదో చిన్న విషయానికి కూడా గొడవపడుతుండేవారు.
అలా కోపంలో భార్య తన భర్తతో ఈ విధంగా అంటుంది..
భార్య : ‘‘ఇక చాలు... ఇలా రోజు నీతో గొడవపడటం నావల్ల కాదు. నాకు తొందరగా విడాకులు కావాలి’’.
భర్త : ‘‘చాకెలెట్ తింటావా’’.
(సిగ్గుపడుతూ) భార్య : ‘‘నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారా?’’
భర్త : ‘‘లేదే తింగిరిదానా... ఏదైనా మంచిపని చేసేముందు చాక్లెట్ తినాలని మా అమ్మ చెప్పేది’’.