ఒకరోజు ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది.
అయితే ఆ సమయంలో ఆమె ఫోన్ ని తన బాయ్ ఫ్రెండ్ కాకుండా తన మేనల్లుడు లిఫ్ట్ చేస్తాడు.
అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మేనల్లుడితో ప్రేమతో ఇలా అంటుంది.
గర్ల్ ఫ్రెండ్ : ‘‘మీ మామయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వవా...? అతనితో మాట్లాడాలి.’’
మేనల్లుడు : ‘‘సరే ఇస్తాను. కానీ ఆయనకు మీ పేరేం చెప్పాలి?’’
గర్ల్ ఫ్రెండ్ : ‘‘ఆయనతో వెళ్లి చెప్పు... తన ప్రియురాలి పోన్ చేసిందని’’
మేనల్లుడు : ‘‘కానీ మొబైల్ ఫోన్ లో మీ నెంబర్ ఐటమ్ నెంబర్ 3 అని సేవ్ చేసి వుంది’’.