ఒక జేబుదొంగకు ఎంత ప్రయత్నించినా.. దొంగతనం చేయడం అతనికి వీలుకావడం లేదు.
ఒకరోజు ఎవరూలేని రాత్రిసమయంలో ఏదైనా ఒక ఏరియాకి వెళ్లి దొంగతనం చేద్దామని ఫిక్స్ అవుతాడు.
అలా కొద్దిసేపు వరకు అతను వెయిట్ చేశాడు.
ఆ దారిలో ఇద్దరు వ్యక్తులు వస్తుండడం ఇతను గమనించాడు.
ఆ జేబుదొంగ ధైర్యం చేసి.. తన దగ్గరున్న కత్తిని చూపించి.. ఇలా అన్నాడు..
జేబుదొంగ : మర్యాదగా మీ జేబులో వున్న డబ్బును తీసి నాకివ్వండి.
అప్పుడా ఇద్దరు వ్యక్తులు : ‘‘నేను ఎమ్మెల్యే.. నేను కలెక్టర్ ని... మా దగ్గరే దొంగతనం చేస్తావా?’’ అని అంటారు.
అప్పుడు ఆ జేబుదొంగ ఇంకాస్త ధైర్యం పెంచుకుని, గంభీరత్వంతో ఇలా అంటాడు.
జేబుదొంగ : అయితే మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి.