ఒక టీవీ రిపోర్టర్ కు ఒక రాజకీయనేతతో ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. అప్పుడు
రిపోర్టర్ : ‘‘మీరు విజయవంతంగా ముందుకు సాగడానికి కారణం ఏంటి?’’
రాజకీయనేత : ‘‘కేవలం మూడు మాటలు!’’
రిపోర్టర్ : ‘‘అయితే అవేంటివి సార్!’’
రాజకీయనేత : ‘‘సరైన నిర్ణయం తీసుకోవడం’’
రిపోర్టర్ : ‘‘ఆ సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’
రాజకీయనేత : ‘‘కేవలం ఒక మాట’’
రిపోర్టర్ : ‘‘ఆ మాటేంటి?’’
రాజకీయనేత : ‘‘అనుభవంతో’’
రిపోర్టర్ : ‘‘మరి ఆ అనుభవం ఎక్కడి నుంచి పొందుతారు?’’
రాజకీయనేత : ‘‘కేవలం ఒకే మాట’’
రిపోర్టర్ : ‘‘అదేంటి సార్’’
రాజకీయనేత చిరునవ్వుతో.. ‘‘తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం’’