ఒకరోజు ఒక రాజకీయ నేత కొడుకు, తన తండ్రితో ఇలా అంటాడు.
కొడుకు : ‘‘నాన్నగారు.. నేను కూడా రాజకీయంలో రావాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి నాకు కొన్ని సూచనలు ఇవ్వండి’’.
రాజకీయ నేత : ‘‘చూడు నాయనా! రాజకీయంలో మూడు కఠోన నిర్ణయాలను తీసుకోవలసి వుంటుంది’’!
కొడుకు : ‘‘సరే.. అవి పాటించడానికి నేను రెడీగా వున్నాను.. అవేంటివో చెప్పు’’
రాజకీయ నేత : ‘‘పదా.. నీకు మొదటిదాని గురించి వివరిస్తా’’
ఇలా చెప్పి ఆ రాజకీయనేత తన కొడుకును ఇంటిపైకి తీసుకెళతాడు.
ఆ తరువాత నేత తన కొడుకును పైనే వదిలేసి.. ఇతను కిందకు వెళ్లిపోతాడు. ఆ తరువాత
రాజకీయ నేత : ‘‘కొడకా! పైనుంచి కిందకు దూకు’’
కొడుకు : ‘‘కానీ నాన్నగారు! నేను ఇక్కడి నుంచి దూకితే నా కాళ్లు, చేతులు విరిగిపోతాయి’’
రాజకీయ నేత : ‘‘నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా కిందకు దూకు. నేను కిందే వున్నాను కదా... నేను నిన్ను పట్టుకుంటాను’’
అప్పుడు కొడుకు కొద్దిసేపు ఆలోచించిన తరువాత ధైర్యం చేసి కిందకు దూకుతాడు. కానీ తన తండ్రి అయిన రాజకీయ నేత తనని పట్టుకోకుండా పక్కకు జరుగుతాడు.
అప్పుడు అతడు ఒక్కసారిగా ‘ఢామ్’ అని కిందకు పడిపోతాడు. తన మనసులో తిట్టరాని తిట్లు తిట్టకుంటూ నాన్నతో ఇలా అంటాడు...
కొడుకు : ‘‘ఏంటి నాన్న ఇలా చేశావ్.. నువ్వు పట్టుకుంటావని చెప్పావుగా?’’
రాజకీయ నేత : ‘‘ఇది మొదటి అధ్యాయం నాయనా! రాజకీయంలో తండ్రిని కూడా నమ్మకూడదు’’