ఒకరోజు నేను ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్లాను.
అప్పుడు నాన్నగారు చాలా కోపంగా నన్ను చూసి, ఇలా అడిగారు.... ‘‘ఇంతసేపు ఎక్కడున్నావ్ రా!’’
నేను : ‘‘నా స్నేహితుడి ఇంటికి వెళ్లాను!’’
అప్పుడు వెంటనే నాన్నగారు నా నలుగురి (4) ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారు.
అప్పుడు నాలుగవ వాడు : ‘‘చెప్పండి అంకుల్... అతను ఇక్కడే వున్నాడు’’.
మూడవ వాడు : ‘‘ఇప్పుడే ఇంటినుంచి వెళ్లాడు అంకుల్’’
రెండవవాడు : ‘‘ఇక్కడే వున్నాడు అంకుల్.. చదువుకుంటున్నాడు. అతనికి ఫోన్ ఇవ్వాలా?’’
ఇక చివరివాడయితే హద్దుమీరిపోయాడు...
మొదటివాడు : ‘‘నాన్నగారు చెప్పండి... ఏమైంది?’’
చంపించేశారు నా స్నేహితులు.. ప్రతిఒక్క ఫ్రెండ్ అవసరమే గురూ!